Raviteja: బాలకృష్ణ 'నో' చెప్పిన పాత్రలో కనిపించనున్న రవితేజ!

Raviteja gets an offer that Balakrishna says no
  • మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' 
  • బిజూ మీనన్ పోషించిన పాత్రను అంగీకరించని బాలయ్య
  • రవితేజ, రానాలతో మల్టీ స్టారర్ గా తయారుకానున్న చిత్రం
  • త్వరలోనే అధికారిక ప్రకటన
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రంలో రెండు కీలక పాత్రలు ఉండగా, ఓ పాత్ర కోసం బాలకృష్ణను సంప్రదిస్తే, ఆయన నో చెప్పడంతో, అదే పాత్రకు రవితేజను తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ సొంతం చేసుకుంది. ఒరిజినల్ లో బిజూ మీనన్ ధరించిన పాత్రను బాలయ్యతో చేయించాలని భావించారు. ఇదే సమయంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రను రానాతో చేయించి, దీన్ని మల్టీ స్టారర్ గా నిర్మించాలని భావించగా, బాలయ్య తన పాత్రపై పెద్దగా ఆసక్తిని చూపించలేదట. దీంతో నిర్మాతలు రవితేజను సంప్రదించగా, ఓకే చెప్పారని, ఈ చిత్రం రానా, రవితేజలతో మల్టీస్టారర్ అవుతుందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనుందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి.
Raviteja
Balakrishna
Movie
Rana
Multi Starer

More Telugu News