Bike: బైక్ టైర్ కు చుట్టుకున్న స్కార్ఫ్... ఖమ్మం జిల్లాలో మహిళ దుర్మరణం!

Woman Died as her Scarf gets tangled in the rear wheel
  • లాక్ డౌన్ కు ముందు అన్న ఇంటికి వెళ్లిన మహిళ
  • బైక్ పై ఇంటికి చేరాలని ప్రయత్నం
  • కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
బైక్ పై వెళుతున్న ఓ మహిళ తన ముఖానికి కట్టుకున్న మాస్క్, బండి వెనుక చక్రంలోకి ఇరుక్కుని కిందపడేయటంతో దుర్మరణం పాలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, విజయవాడ రూరల్ మండల పరిధిలోని పైడూరుపాడుకు చెందిన మాలన్ బీ (45) లాక్ డౌన్ కు ముందు కొత్తగూడెంలో ఉన్న తన అన్నయ్య ఇంటికి వెళ్లింది. ఆపై అక్కడే చిక్కుకుపోయిన ఆమె, ఇప్పుడు సడలింపులు లభించిన తరువాత, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది.

ఇదే సమయంలో ఆమె అన్న అల్లుడు గపూర్ నందిగామ బయలుదేరగా, తాను కూడా అక్కడి వరకూ వచ్చి, ఆపై బస్సులో వెళ్తానని చెప్పి బయలుదేరింది. మార్గమధ్యంలో తల్లాడ సమీపంలోకి వాహనం రాగానే, మాలన్ బీ ముఖానికి చుట్టుకుని ఉన్న స్కార్ఫ్ ప్రమాదవశాత్తూ, వెనుక చక్రంలోకి ఇరుక్కుంది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడగా, వెనుక కూర్చున్న మాలన్ బీ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
Bike
Scarf
Lockdown
Lady
Died

More Telugu News