anasuya: థ్యాంక్యూ సీఎం కేసీఆర్ సర్‌: యాంకర్ అనసూయ ట్వీట్

anasuya about tollywood shootings
  • షూటింగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి
  • మా పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు
  • జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తామని హామీ ఇస్తున్నాము
తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పరిమిత సిబ్బందితో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. దీనిపై యాంకర్‌, సినీనటి అనసూయ హర్షం వ్యక్తం చేసింది.

'మా పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. థ్యాంక్యూ కేసీఆర్‌ సర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సర్. మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తామని హామీ ఇస్తున్నాము. సినీ పరిశ్రమలో అన్ని స్థాయుల్లో ఉన్న వారికి ఇది చాలా గొప్ప వార్త. ఎంటర్టైన్‌మెంట్‌ తప్ప మాకు ఇతర ఏ పనీ తెలియదు' అని నవ్వుతూ ఉన్న ఎమోజీని ఆమె పోస్ట్ చేసింది.
anasuya
Telangana
KCR
Tollywood

More Telugu News