Balakrishna: బాలయ్యకు ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు.. లోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

balaiah birthday wishes
  • చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతతో ఉంటారు: చంద్రబాబు
  • అందరికీ బాలయ్య.. నాకు మాత్రం ముద్దుల మావయ్య: లోకేశ్
  • మా బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు: రాఘవేంద్ర రావు
సినీనటుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణ గారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణగారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.

'అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు, షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు' అని టీడీపీ నేత లోకేశ్ ట్వీట్ చేశారు.

'నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూశాను. చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. మావయ్యా... మీరు మరెన్నో చిత్రాల్లో నటించి... మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను' అని ఆయన చెప్పారు.

'మా బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. మా సొంత నిర్మాణ సంస్థ ఆర్కే ఫిలిమ్స్ అన్నగారి వారసుడుతోనే ప్రారంభించాలనుకున్నాము. మా బాలయ్యతోనే అది మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇంకెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నాను' అని దర్శకుడు రాఘవేంద్ర రావు ట్వీట్ చేశారు.

Balakrishna
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News