Rajamouli: కరోనా కష్టకాలంలో చిత్రపరిశ్రమకు భరోసా ఇచ్చారు: సీఎం జగన్ పై రాజమౌళి ప్రశంసలు

SS Rajamouli praises AP CM Jagan
  • ఏపీ సీఎంతో సమావేశమైన టాలీవుడ్ ప్రముఖులు
  • సమావేశంలో పాల్గొన్న చిరంజీవి, రాజమౌళి తదితరులు
  • సీఎంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు రాజమౌళి ట్వీట్
ఇవాళ టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో భేటీ అయి చిత్ర పరిశ్రమ సమస్యలు నివేదించారు. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రాజమౌళి, నాగార్జున, దిల్ రాజు, సి.కల్యాణ్, సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. భేటీపై రాజమౌళి తన అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఏపీ సీఎం జగన్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం ఏర్పడి సినీ రంగం, థియేటర్ల యాజమాన్యాలు కుదేలైన నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు సీఎం జగన్ ఓ భరోసా కల్పించారని రాజమౌళి కొనియాడారు. థియేటర్ల విద్యుత్ విషయంలో కనీస ఫిక్సడ్  చార్జీల నిర్ణయం తీసుకోవడం గొప్ప నిర్ణయం అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. థియేటర్ల యాజమాన్యాలకు ఈ నిర్ణయం తప్పక ఊరట కలిగిస్తుందని జక్కన్న అభిప్రాయపడ్డారు.
Rajamouli
Jagan
Tollywood
Meeting
Industry
Theaters
Lockdown
Corona Virus
Andhra Pradesh

More Telugu News