Balakrishna: శివశంకరి శివానంద లహరి...  నాటి పాటను మళ్లీ పాడిన బాలకృష్ణ!

Balakrishna sung all time hit Shivashankari song
  • జగదేకవీరుని కథ చిత్రంలోని హిట్ సాంగ్ ఆలపించిన బాలయ్య
  • నాడు ఎన్టీఆర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన పాట
  • తాజాగా పాటతో వీడియో విడుదల చేసిన బాలయ్య
నాడు నందమూరి తారకరామారావు నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివశంకరి శివానంద లహరి గీతం ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆ పాట ప్రజల నోళ్లపై మెదులుతూనే ఉంటుంది. తాజాగా ఆ పాటను నందమూరి బాలకృష్ణ ఆలపించి, దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అభిమానులకు తన పుట్టినరోజు కానుకగా అందించారు. వీడియోలో తన తండ్రి ఎన్టీఆర్ పాట వస్తుండగా, బాలయ్య నేపథ్యగానం అందించారు. ఆయన పాట మొత్తం ఆలపించడమే కాదు, ఎంతో క్లిష్టమైన రాగాలను సైతం పలికేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.
Balakrishna
Shivashankari
Song
Birthday
Gift
Fans
Tollywood

More Telugu News