Nagababu: 'మంచివాడు' అనే ఇమేజ్ ను మోయడం బహుభారం: నాగబాబు

Nagababu comments on Positive and Negative image
  • ట్విట్టర్ లో నాగబాబు ఫిలాసఫీ
  • మంచివాడిగా బతకడం తలనొప్పి వ్యవహారమంటూ ట్వీట్
  • ఏదో ఒక నెగెటివ్ అభిప్రాయమే మేలని వివరణ
మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మంచివాడు' అనే ఇమేజ్ ను జీవితాంతం మోయడం బహుభారం అని, అంతకంటే తలనొప్పి మరొకటి లేదని అభిప్రాయపడ్డారు. అందుకే, ఇతరులు మనపై మంచివాడనో, గొప్పవాడనో, గౌరవనీయుడనో సదభిప్రాయం కలిగివుండడం కంటే... ఇతను దుష్టుడు, దుర్మార్గుడు, స్వార్థపరుడు అనే రీతిలో ఏదో ఒక నెగెటివ్ అభిప్రాయం కలిగివుండడమే మేలని వివరించారు. ఈ మేరకు నాగబాబు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
Nagababu
Positive Image
Negative Image
Life
Twitter

More Telugu News