సీఎం జగన్ ను కలవడానికి వచ్చిన టాలీవుడ్ ప్రముఖుల వద్ద రాజధాని రైతుల నిరసన
- ఈ మధ్యాహ్నం సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ
- గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ లో బస చేసిన సినీ ప్రముఖులు
- తమ ఉద్యమానికి సహకరించాలని కోరిన రైతులు
ఈ సందర్భంగా సినీ ప్రముఖులను కలిసిన రాజధాని రైతులు రాజధానిని కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. 175 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నామని, తమ ఉద్యమానికి సినీ ప్రముఖులు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. రైతుల సమస్యలపై ఎన్నో సినిమాలు తీశారని, తాము చేస్తున్న ఉద్యమానికి కూడా సహకరించాలని అన్నారు. కాగా, గెస్ట్ హౌస్ లోకి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో రైతులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.