Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షలు

corona test for kejriwal
  • హోం క్వారంటైన్‌లో కేజ్రీవాల్
  • కరోనా పరీక్షల ఫలితాలు రేపు ఉదయం లోపు వచ్చే అవకాశం
  • ఆదివారం మధ్యాహ్నం నుంచి కేజ్రీవాల్‌కు జ్వరం
  • అన్ని సమావేశాలను వాయిదా వేసిన సీఎం
జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన నివాసానికి వచ్చిన వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఈ రోజు రాత్రి లేక రేపు ఉదయం వచ్చే అవకాశం ఉంది.

కాగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి జ్వరంతో బాధపడుతోన్న కేజ్రీవాల్ వైద్యుల సూచనల మేరకు నిన్నటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. తాను పాల్గొనాల్సి ఉన్న అన్ని సమావేశాలను వాయిదా వేశారు. పలు అంశాలపై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తున్నారు.
Arvind Kejriwal
AAP
New Delhi
Corona Virus

More Telugu News