Rahul Gandhi: లడఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా?: రాహుల్ గాంధీ

rahul on china
  • లడఖ్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై రాహుల్ నిలదీత
  • పారదర్శకంగా వివరాలు చెప్పాలని కొన్ని రోజులుగా డిమాండ్
  • వివరాలు చెప్పకుండా 'హస్తం' గుర్తుపై కామెంట్లు చేస్తున్నారని వ్యాఖ్య
తూర్పు లడఖ్‌లో చైనా-భారత్‌ మధ్య చోటు చేసుకుంటోన్న పరిణామాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా అన్ని వివరాలు తెలపాలని డిమాండ్ చేస్తోన్న రాహుల్ గాంధీ తాజాగా ట్విట్టర్‌ ద్వారా ఈ విషయంపై మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

'రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హస్తం గుర్తుపై కామెంట్ చేశారు బాగానే ఉంది. మరి ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతారా? లడఖ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా?' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

కాగా, లడఖ్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై సమాధానం చెప్పాలంటూ రాహుల్ చేస్తోన్న డిమాండ్‌పై నిన్న స్పందించిన రాజ్‌నాథ్‌ సింగ్... 'మీ చేతికి నొప్పి పెడితే దానికి మందు ఉంటుంది. కానీ, మీ పార్టీ గుర్తు హస్తమే సమస్య అయితే ఏం చేయగలం?' అంటూ ట్వీట్ చేశారు. దానిపైనే స్పందిస్తూ రాహుల్ ఈ రోజు ఈ విధంగా స్పందించారు.
Rahul Gandhi
Congress
China

More Telugu News