Arjun: 'నీ మామను వచ్చాను లేవరా...': వెక్కి వెక్కి ఏడ్చిన హీరో అర్జున్!

Chiranjeevi Sarja Last Riutals in Basavanagudi
  • అశ్రునయనాల మధ్య చిరంజీవి సర్జా అంత్యక్రియలు
  • ఒక్కలిగ సంప్రదాయంలో ముగిసిన క్రతువు
  • మేనల్లుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన అర్జున్
తానెంతో ప్రేమగా చూసుకునే మేనల్లుడు చిరంజీవి సర్జా మరణాన్ని తట్టుకోలేకపోయిన నటుడు అర్జున్, వెక్కి వెక్కి ఏడ్చారు. మేనల్లుడి మరణం తరువాత, ఆదివారం రాత్రి కారులో బెంగళూరుకు చేరుకున్న ఆయన, నిన్న జరిగిన సర్జా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. "నేను... నీ మామను వచ్చాను... లేవరా..." అంటూ అర్జున్ బోరున విలపించడాన్ని చూసి పలువురు బంధుమిత్రులు కన్నీరు పెట్టుకున్నారు.

కాగా, చిరంజీవి సర్జా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తారని భావించిన స్థానిక పోలీసులు, బసవనగుడి ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినా, అక్కడికి వచ్చే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఒక్కలిగ సంప్రదాయంలో నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి.

గతంలో మరణించిన చిరంజీవి సోదరుడు ధృవ అంత్యక్రియలు జరిగిన సొంత ఫామ్ హౌస్ బృందావనంలోనే ఇతని అంత్యక్రియలు కూడా నిర్వహించాలని నిర్ణయించిన కుటుంబీకులు అశ్రునయనాల మధ్య పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కుటుంబీకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Arjun
chiranjeevi Sarja
Died
Final Riutals

More Telugu News