Balakrishna: ఈ సాయంత్రం 5.03... బర్త్ డే ముందురోజే ఫ్యాన్స్ కు బాలకృష్ణ గిఫ్ట్!

Balakrishna Song Released Today
  • రేపు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు
  • కొత్త సినిమా కోసం స్వయంగా పాట
  • నేడు విడుదల చేయనున్నట్టు ప్రకటన
తన ప్రతి పుట్టిన రోజునా అభిమానులకు ఏదో ఒక సర్ ప్రయిజ్ ను ఇచ్చే నందమూరి బాలకృష్ణ, తన 60వ పుట్టిన రోజు విషయంలో మాత్రం, ఒకరోజు ముందే ట్రీట్ ఇవ్వనున్నారు. నేటి సాయంత్రం తాను స్వయంగా పాడిన ఓ పాటను ఆయన అందించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఎన్బీకే ఫిల్మ్స్, సాయంత్రం 5.03 నిమిషాలకు అభిమానులకు ఈ బహుమతి అందుతుందని తెలిపారు. యూట్యూబ్ ద్వారా ఈ పాట విడుదల కానుంది. ఇదే సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య  చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వస్తుందని సమాచారం.
Balakrishna
Song
Virthday

More Telugu News