Arvind Kejriwal: ఢిల్లీవాసులంటే ఎవరు?: కేజ్రీవాల్ కు చిదంబరం సూటి ప్రశ్న

  • ఢిల్లీ ఆసుపత్రుల్లో స్థానికులకే వైద్యం అన్న కేజ్రీవాల్
  • నేను ఢిల్లీవాసిని అవుతానా? అంటూ చిదంబరం ప్రశ్న
  • న్యాయ నిపుణులను సంప్రదించారా? అంటూ సందేహం
who is a Delhiite Chidambaram question to Kejriwal

ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులు, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం స్థానికులకు మాత్రమే కరోనా చికిత్స అందిస్తామంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీవాసులు అంటే ఎవరని సూటిగా ప్రశ్నించారు. తాను ఇక్కడే నివసిస్తున్నానని, ఇక్కడే పని చేస్తున్నానని... తాను ఢిల్లీవాసిని అవుతానా? అని ప్రశ్నించారు.

జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ పథకాల కింద పేర్లు నమోదు చేయించుకున్నవారు దేశంలో ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చని తాను భావిస్తున్నానని చిదంబరం అన్నారు. ఇలాంటి ప్రకటన చేసేముందు ఎవరైనా న్యాయ నిపుణులను కేజ్రీవాల్ సంప్రదించారా? లేదా? అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

More Telugu News