Murali Sharma: టాలీవుడ్ నటుడు మురళి శర్మకు మాతృవియోగం

Murali Sharma mother Padma Sharma dies of heart attack
  • మురళి శర్మ తల్లి పద్మ శర్మ కన్నుమూత
  • గత రాత్రి గుండెపోటుకు గురైన పద్మ శర్మ
  • టాలీవుడ్ నటుల సంతాపం
టాలీవుడ్ లో క్యారెక్టర్ గా ఆర్టిస్ట్ గా ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్న మురళి శర్మ కుటుంబంలో విషాదం నెలకొంది. మురళి శర్మ తల్లి పద్మ శర్మ కన్నుమూశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. ముంబయిలోని తమ నివాసంలో పద్మ శర్మ గత రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. మురళి శర్మ తల్లి మరణించారన్న సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ నటులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
Murali Sharma
Padma Sharma
Demise
Heart Attack
Tollywood

More Telugu News