విద్యుత్ చార్జీల అంశంపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి
- మూడు నెలల వినియోగాన్ని కలిపి లెక్కించారన్న రేవంత్
- స్లాబులు మారిపోయాయని వెల్లడి
- ఉపాధి కోల్పోయిన ప్రజలకు షాక్ ఇస్తున్నారని వ్యాఖ్యలు
సాధారణంగా 100 యూనిట్ల స్లాబులో ఉండే వినియోగదారులు ఇప్పుడు 300 యూనిట్ల స్లాబులోకి వచ్చారని వివరించారు. విద్యుత్ చార్జీల మదింపుతో పేద, మధ్య తరగతి ప్రజల జేబుకు ప్రభుత్వం చిల్లు పెడుతోందని తన లేఖలో ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఒక్క రూపాయి అదనపు భారం పడినా చూస్తూ ఊరుకోబోమని రేవంత్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు.