Balakrishna: జగన్ అప్పట్లో కడప అభిమాన సంఘం టౌన్ ప్రెసిడెంట్: బాలకృష్ణ

Balakrishna reveals YS Jagan once Kadapa town president
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన బాలయ్య
  • జగన్ తనకు వీరాభిమాని అంటూ వివరణ
  • తన తండ్రి ఎన్టీఆర్ కు కేసీఆర్ అభిమాని అని వెల్లడి
హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా తక్కువమందికి తెలిసిన విషయం వెల్లడించారు. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ఒకప్పుడు తన వీరాభిమాని అని, జగన్ కడప జిల్లా అభిమాన సంఘానికి టౌన్ ప్రెసిడెంట్ అని తెలిపారు.

కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా పేపర్లో ప్రకటనలు కూడా ఇచ్చేవారని, పేపర్లో ఓవైపు బాలకృష్ణ, మరోవైపు జగన్ ఉండేలా ప్రకటనల వచ్చేవని మీడియా సంస్థ ప్రతినిధి చెప్పగా, అవునంటూ బాలయ్య నవ్వేశారు. అయితే సినీ అభిమానం వేరు, రాజకీయాలు వేరని బాలయ్య స్పష్టం చేశారు.

అటు, తెలంగాణ సీఎం కేసీఆర్ తన తండ్రి దివంగత ఎన్టీఆర్ కు అభిమాని అని, కేసీఆర్ బ్రహ్మాండంగా రాజకీయాల్లో రాణిస్తారని తన తండ్రి ఆనాడే చెప్పారని బాలకృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు. నాడు కాంగ్రెస్ పార్టీలో 90 శాతం మంది నాన్నగారి అభిమానులేని వివరించారు.
Balakrishna
Jagan
Fans
Kadapa
Town President
Tollywood

More Telugu News