Devineni Uma: ఆన్‌లైన్‌లో నిమిషాల్లో ఇసుక ఖాళీ: దేవినేని ఉమ

devineni fires on ycp
  • వైసీపీ నాయకుల గుప్పెట్లో మాత్రం వేల టన్నుల ఇసుక
  • స్టాక్ యార్డ్ లో 20 వేలు చూపించడం లేదు
  • లారీ ఆపిన అధికారులకు బెదిరింపులు
  • మీ నేతల అండర్ కవర్ అవినీతి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'ఆన్‌లైన్‌లో నిమిషాల్లో ఇసుక ఖాళీ. మీ నాయకుల గుప్పెట్లో మాత్రం వేల టన్నుల ఇసుక. లక్షల లారీల ఇసుక తరలించినా స్టాక్ యార్డ్ లో 20 వేలు చూపించడం లేదు. లారీ ఆపిన అధికారులకు బెదిరింపులు మీ నేతల అండర్ కవర్ అవినీతితో, ఇసుక దోపిడితో రోడ్డున పడ్డ  భవననిర్మాణ కార్మికుల కుటుంబాలకు సమాధానం చెప్పండి జగన్‌  గారు' అంటూ దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు.
 
ఇసుకను ఆన్‌లైన్‌లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల లోపు బుక్‌ చేసుకునేలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ అవకాశం కల్పించిందని, అయితే, కొన్ని కేంద్రాల్లో 15 నిమిషాల్లో ఇసుకంతా బుక్‌ అయినట్లు చూపుతోందని అందులో పేర్కొన్నారు.
Devineni Uma
Telugudesam
Andhra Pradesh

More Telugu News