కియారా కాదట... మహేశ్ బాబు పక్కన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్?
- పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ చిత్రం
- 'సర్కారు వారి పాట' టైటిల్ వైరల్
- 'దబాంగ్ 3' చిత్రంలో నటించిన సాయి
ఇప్పడు కియారా ప్లేస్ లో మరో పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందన్నది టాలీవుడ్ వర్గాల భోగట్టా. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిని సంప్రదించిందని, ఆమె ఒప్పుకుందని కూడా తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. కాగా, సాయి, ఆ మధ్య వచ్చిన సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' చిత్రంలో నటించింది.