Keerthi Suresh: ఓటీటీ ద్వారా వచ్చేస్తున్న కీర్తి సురేశ్ సినిమా!

Keerthi Suresh starrer Penguin releases through OTT
  • 'ఓటీటీ'ని ఎంచుకుంటున్న కొందరు నిర్మాతలు 
  • కీర్తి సురేశ్ కథానాయికగా రూపొందిన 'పెంగ్విన్'
  • ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల
  • గర్భవతిగా కనిపించనున్న కీర్తి     
'థియేటర్ల కోసం వేచిచూసే ఓపిక మాకు లేదు' అంటున్నారు కొందరు తమిళ నిర్మాతలు. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడడంతో విడుదలకు సిద్ధంగా వున్న సినిమాలు కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్ల కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే, ఇక్కడ సినిమా నిర్మాణం కోసం తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి, నిండా మునిగిపోతామని భావించిన కొందరు నిర్మాతలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను చూసుకుంటున్నారు.

ఈ క్రమంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'పెంగ్విన్' చిత్రం ఆన్ లైన్ లో ముందుగా విడుదల కావడానికి ఒప్పందం జరిగిపోయింది. ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇది విడుదల కానుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 8న సినిమాకు సంబంధించిన టీజర్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ రిలీజ్ చేయనుంది.

ఇక ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కీర్తి సురేశ్ గర్భవతిగా కనిపిస్తుంది. ఈ సినిమా తనకి మంచి పేరుతెస్తుందని ఆమె చాలా ఆశలు పెట్టుకుంది.    
Keerthi Suresh
Penguin
Kartik Subbaraju
OTT

More Telugu News