Deepika Padukone: భార్య తిడుతోందని లైవ్ ఆపేసి వెళ్లిపోయిన హీరో రణవీర్ సింగ్

Ranveer Singh left live as Deepika calls him
  • లాక్ డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉన్న దీపికా పదుకునే, రణవీర్
  • ఆయుష్మాన్ తో ఇన్స్టా లైవ్ లో ముచ్చటించిన రణవీర్
  • దీపిక తిట్టడంతో లైవ్ ఆపేసిన వైనం
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకునే, రణవీర్ సింగ్ షూటింగులతో ఎప్పుడూ బిజీగా గడిపేవారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారి కావాల్సినంత సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా మరో నటుడు ఆయుష్మాన్ ఖురానాతో రణవీర్ ఇన్స్టా లైవ్ లో ముచ్చటించాడు.

ఇద్దరి మధ్య చాలా ఫన్నీగా ముచ్చట్లు కొనసాగుతున్న సమయంలో... 'ఓకే ఆయుష్మాన్, ఇక నేనుంటాను' అని రణవీర్ చెప్పాడు. అప్పుడే ఎందుకు అని ఆయుష్మాన్ ప్రశ్నించాడు. మీ వదిన జూమ్ చాట్ లో ఉందని, గట్టిగా మాట్లాడొద్దని తిడుతోందని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత లైవ్ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అభిమానులతో ఆయుష్మాన్ లైవ్ కొనసాగించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
Deepika Padukone
Ranveer Singh
Bollywood

More Telugu News