దావూద్ ఇబ్రహీం మృతి చెందాడంటూ ప్రముఖ మీడియా సంస్థ ప్రకటన
- దావూద్ కరోనా బారిన పడ్డాడంటూ నిన్నటి నుంచి వార్తలు
- ఈ వార్తలను ఖండించిన దావూద్ సోదరుడు అనీఫ్
- దావూద్ చనిపోయాడని న్యూస్ ఎక్స్ ప్రకటన
అయితే దావూద్ సోదరుడు అనీఫ్ ఇబ్రహీం ఈ వార్తలను ఖండించాడు. దావూద్ కు కానీ, తమ కుటుంబంలోని ఇతర సభ్యులకు కానీ కరోనా పాజిటివ్ రాలేదని చెప్పాడు. అందరూ ఇంట్లోనే ఉన్నారని తెలిపాడు.
ఈ తరుణంలో ప్రముఖ మీడియా సంస్థ న్యూస్ ఎక్స్ సంచలన ప్రకటన చేసింది. కరోనా కారణంగా దావూద్ ఇబ్రహీం కరాచీలో మృతి చెందాడని ట్వీట్ చేసింది. అయితే దావూద్ మృతికి సంబంధించి మరే ఇతర అధికారిక ప్రకటన వెలువడలేదు.