Daggubati Abhiram: మా తాత ఉండుంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు: దగ్గుబాటి అభిరామ్

I would be a hero if my grand father is alive says Daggubati Abhiram
  • తాత ఉండుంటే నేను హీరో అయిపోయేవాడిని
  • ఆయనను ఎంతో మిస్ అవుతున్నా
  • ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి
తాతయ్య రామానాయుడు బతికుంటే తనకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదని దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ అన్నాడు. ఆయన ఉండుంటే తాను హీరో అయ్యేవాడినని, తనకు ఎంతో సపోర్ట్ ఉండేదని చెప్పాడు. ఆయనను తాను ఎంతో మిస్ అవుతున్నానని అన్నాడు.

భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ... మానసికంగా ఆయన తనకు దగ్గరగా ఉన్నారనేది తన ఫీలింగ్ అని చెప్పాడు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు. తాతయ్య జయంతి సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న సినీ నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు. 'నీవు హీరో అయిపోతావులే' అంటూ అభిరామ్ భుజం తట్టారు.
Daggubati Abhiram
Ramanaidu
Tollywood

More Telugu News