Allu Arjun: సౌత్ ఇండియా స్టార్స్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన బన్నీ!

Allu Arjun creates history in social media
  • సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న బన్నీ
  • 1.30 కోట్ల లైక్స్ సాధించిన బన్నీ ఫేస్ బుక్ పేజ్
  • ఒక సౌత్ స్టార్ ఈ రేంజ్ లో లైక్స్ సాధించడం ఇదే తొలిసారి
సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా విషయాలే కాకుండా తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో బన్నీ పంచుకుంటుంటాడు. ఇటీవలే బన్నీకి 'కింగ్ ఆఫ్ సోషల్ మీడియా' అనే ట్యాగ్ కూడా వచ్చింది.

తాజాగా బన్నీ దక్షిణాదిలో ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బన్నీ ఫేస్ బుక్ పేజీ ఏకంగా 1.30 కోట్ల లైకులను క్రాస్ చేసింది. మొత్తంమీద 1,31,97,873 లైకులను సొంతం చేసుకుంది. ఒక సౌత్ స్టార్ ఈ రేంజ్ లో లైక్స్ సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనతను సాధించిన తొలి స్టార్ గా బన్నీ రికార్డు సృష్టించాడు.
Allu Arjun
Facebook
likes
Tollywood

More Telugu News