Jagan: జగన్‌ గారితో భేటీ అవుతున్నాం.. బాలకృష్ణను కూడా ఆహ్వానించాం!: సి.కల్యాణ్

actors to meet jagan
  • చిరంజీవి నేతృత్వంలో జగన్‌తో ఈ నెల 9న సినీ ప్రముఖుల భేటీ
  • పాల్గొననున్న దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు
  • పుట్టిన రోజు వేడుకల వల్ల హాజరు కాలేనన్న బాలకృష్ణ
లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగులపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్‌ పెద్దలు సమావేశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం కావాలని వారు నిర్ణయం తీసుకున్నారు. జగన్‌తో చిరంజీవి నేతృత్వంలో ఈ నెల 9న సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇందులో దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు పాల్గొంటారు.

సినీ పరిశ్రమ సమస్యలతో షూటింగులకు అనుమతులపై చర్చిస్తారు. జగన్‌తో సమావేశానికి బాలకృష్ణను ఆహ్వానించినట్లు నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. అయితే, తన పుట్టిన రోజు వేడుకల వల్ల హాజరు కాలేనని బాలకృష్ణ చెప్పారని ఆయన అన్నారు. కాగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన భేటీకి బాలకృష్ణను ఆహ్వానించలేదంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
Jagan
Chiranjeevi
Andhra Pradesh
Tollywood

More Telugu News