Police: నిరసన తెలుపుతున్న వృద్ధుడిపై అమెరికా పోలీసుల దాష్టీకం.. వీడియో ఇదిగో!

Buffalo police shoves an old man
  • ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మృతి
  • పోలీసుల తీరుపై అగ్నిగుండంలా మారిన అమెరికా
  • తాజాగా మరో వృద్ధుడిపై దాడి
అమెరికాలో ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడ్ని ఓ పోలీసు అధికారి తన మోకాలితో నొక్కిపెట్టి అతడి మరణానికి కారణమయ్యాడు. ఈ ఒక్క సంఘటన యావత్ అమెరికాను అట్టుడికిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో సంయమనం పాటించాల్సిన పోలీసులు ఏం మారలేదు సరికదా, మరో వ్యక్తిపై దాష్టీకం చెలాయించారు. నిరసన తెలిపేందుకు వచ్చిన 75 ఏళ్ల వృద్ధుడ్ని నిర్దాక్షిణ్యంగా నెట్టివేయడంతో అతడి తలకు బలమైన గాయం తగిలి రక్తస్రావమైంది. ఇంత జరిగినా ఆ పోలీసు అధికారి ఏమాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయాడు. పాపం, ఆ వృద్ధుడు అచేతనంగా పడిపోవడం తాలూకు వీడియో అమెరికన్లలో మరింత ఆగ్రహావేశాలు రగుల్చుతోంది. ఈ ఘటన అమెరికాలోని బఫెలో నగరంలో జరిగింది.

Police
Protester
Buffalo
George Floyd
USA

More Telugu News