Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం, అతని భార్యకు కరోనా పాజిటివ్

Dawood Ibrahim and his wife tested corona positive
  • కరాచీ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స
  • క్వారంటైన్ లో వ్యక్తిగత సిబ్బంది, గార్డులు
  • ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు అతని భార్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పాకిస్థాన్ ప్రభుత్వంలోని ఓ విశ్వసనీయమైన వ్యక్తి నుంచి ఈ సమాచారం తెలిసినట్టు పాక్ మీడియా వెల్లడించింది. కరాచీలోని మిలిటరీ ఆసుపత్రిలో దావూద్ చికిత్స పొందుతున్నాడు. అతన భార్య కూడా అక్కడే చికిత్స పొందుతోంది. మరోపక్క, దావూద్ వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

ముంబైలోని డోంగ్రీలో జన్మించిన దావూద్ ఇబ్రహీం ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1993 బాంబే బాంబు పేలుళ్ల కేసులో కీలక ముద్దాయి అతను. దావూద్ పై పలు ఇంటర్ పోల్ నోటీసులు ఉన్నాయి. 2003లో దావూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ఇండియా, అమెరికా ప్రకటించాయి. ప్రపంచంలోని టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లలో ఒకరిగా దావూద్ ను అమెరికాకు చెందిన ఎఫ్బీఐ ప్రకటించింది.
Dawood Ibrahim
Corona Virus
Karachi
Pakistan

More Telugu News