Pawan Kalyan: పంచ భూతాలను కాపాడుకుందాం: పవన్ కల్యాణ్‌ పిలుపు

pawan kalyan on environment
  • పర్యావరణ దినోత్సవం సందర్భంగా సందేశం
  • మానవ జాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలం
  • మానవ మనుగడకు పంచభూతాలే ఆధారం
  • పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుంది
పంచభూతాలను కాపాడుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ తమ పార్టీ మూల సిద్ధాంతమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మానవ జాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని, మానవ మనుగడకు పంచభూతాలే ఆధారమన్నారు.

నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని చెప్పారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి ఉందని చెప్పారు. చక్కటి పర్యావరణం ఉన్న చోట ఆసుపత్రుల అవసరం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారని చెప్పారు.  

        
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News