Donald Trump: ఇది అమేజింగ్..‌ ఒకే ఒక్క మనిషి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇలా చేయగలిగారు!: రామ్‌ గోపాల్‌ వర్మ

Its amazing that just one man  realDonaldTrump  has managed
  • ట్రంప్‌పై వర్మ సెటైర్లు
  • ట్రంప్‌ తీరుపై తనదైన శైలిలో స్పందన
  • అమెరికాను ట్రంప్ ఒక జోక్‌లా చూసేలా చేశారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. అమెరికాలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలు విచిత్రంగా ఉంటున్నాయంటూ తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రామ్‌ గోపాల్‌ వర్మ తన ట్విట్టర్‌ ఖాతాలో.. 'ఇది చాలా అద్భుతం.. కేవలం ఒకే ఒక్క మనిషి డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికాను ఒక జోక్‌లా చూసేలా చేశారు' అని పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్‌పై స్పందిస్తోన్న నెటిజన్లు.. నీ దృష్టి కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్‌పై పడిందేంటీ? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Donald Trump
america

More Telugu News