Anam Ramanarayana Reddy: మీరున్నది మంత్రులకు కాఫీ, టిఫిన్లు మోయడానికా?: అధికారులపై ఆనం ఫైర్

Anam Rama Narayana Reddy fires on Nellore district officials
  • అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని ఆరోపణ
  • వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారా? అంటూ ఆగ్రహం
  • సీఎం చెప్పినా అధికారులు వినిపించుకోవడం లేదని అసంతృప్తి
నెల్లూరు జిల్లా అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి పారుదల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. స్వర్ణముఖి లింక్ కెనాల్ ను పరిశీలించాలని సీఎం చెప్పినా అధికారులు వినిపించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా అధికారులు ఉన్నది మంత్రులకు కాఫీ, టిఫిన్లు మోసేందుకా? అంటూ ఆనం నిప్పులు చెరిగారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారా? అంటూ మండిపడ్డారు. రావూరులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల కోసం స్థలం అవసరముందని, ఐదు ఎకరాల భూమి కోసం ప్రిన్సిపల్ ఇంకా వెతుకుతూనే ఉన్నారని ఆనం అన్నారు. గిరిజన గురుకులం భనవ నిర్మాణం గురించి ఐటీడీఏ పీఓ పట్టించుకోవడంలేదని విమర్శించారు.
Anam Ramanarayana Reddy
MLA
Officials
Nellore District
Venkatagiri
Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News