Google: అమెరికాలో జాతి వివక్షపై పోరాటానికి భారీగా సాయం ప్రకటించిన గూగుల్

Google announces financial help to organisations
  • 37 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన సుందర్ పిచాయ్
  • కొన్ని నిమిషాలు మౌనం పాటించాలని పిలుపు
  • ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం
జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతి వ్యక్తిని ఓ పోలీసు అధికారి మెడపై తొక్కిపెట్టడం, ఆపై ఆ వ్యక్తి మృతి చెందడం అమెరికాలో నిరసన జ్వాలలకు కారణమైంది. గత కొన్నిరోజులుగా అమెరికాలో ఆందోళనకర వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాలన్నీ ప్రదర్శనకారుల ఆందోళనలు, నిరసనలతో హోరెత్తుతున్నాయి. జాతి వివక్షకు అంతమెప్పుడు అంటూ వీధుల్లోకి వచ్చి నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అమెరికాలో జాతి వివక్షపై పోరాటానికి గూగుల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 37 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించారు.

జాతి అసమానతలపై పోరాటం సాగిస్తున్న సంస్థలకు 12 మిలియన్ డాలర్ల సాయం, జాతి వివక్షకు గురవుతున్న బాధితుల తరఫున పోరాడే సంస్థలకు 25 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నట్టు పిచాయ్ వివరించారు. కాగా, అమరులైన నల్లజాతీయులను స్మరిస్తూ కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించాలని గూగుల్ పిలుపునిచ్చింది. ఈ మేరకు తమ ఉద్యోగులందరికీ ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది.
Google
Anti Racist
Organisations
Sundar Pichai
George Floyd
USA

More Telugu News