Donald Trump: ట్రంప్ కు తనయ షాక్.. నిరసనలకు మద్దతు తెలిపిన ట్రంప్‌ చిన్నకూతురు!

trump daughter on protests
  • నల్లజాతీయుడు‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతి పట్ల నిరసనలు
  • నిరసనకారులపై ట్రంప్ మండిపాటు
  • అందరూ కలిసి నడిస్తే చాలా సాధించవచ్చని ట్రంప్‌ కూతురి ట్వీట్
అమెరికాలో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతీయుడు‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా ఆ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, హింస చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసనకారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఆయన చిన్న కూతురు టిఫాని ట్రంప్ మాత్రం‌ ఆ నిరసనలకు మద్దతు తెలిపి తన తండ్రికి షాక్‌ ఇచ్చారు.

నిరసనకు గుర్తుగా, మద్దతుగా నలుపురంగును తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఒంటరిగా పోరాడితే ఫలితం అంతగా ఉండదని, అందరూ కలిసి నడిస్తే చాలా సాధించవచ్చన్న హెలెన్‌ కెల్లర్‌ వ్యాఖ్యలను ఆమె క్యాప్షన్‌గా రాయడం గమనార్హం. ఆమె ఈ విధంగా మద్దతు పలకడం పట్ల సామాజిక మాధ్యమాల్లో ఆమెపై ప్రశంసల జల్లుకురుస్తోంది. అంతేకాదు, టిఫాని ట్రంప్‌ తల్లి కూడా  నిరసనలకు మద్దతు పలికారు.  

            

Donald Trump
america
Twitter

More Telugu News