Marriage: వధువుకు కరోనా... ఆఖరి నిమిషంలో ఆగిన వివాహం!

Bride gets corona Marriage Stopped
  • పెళ్లి కోసం ఢిల్లీ నుంచి వచ్చిన వధువు
  • పరీక్షలు చేసిన అధికారులు
  • తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలో ఘటన
మరికొన్ని గంటల్లో జరగాల్సిన ఓ వివాహం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఈ నెల 1న ఓ యువకుడు, యువతికి పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు. ఢిల్లీలో ఉన్న వధువు వివాహం నిమిత్తం మరో ఐదుగురితో కలిసి గత నెల 29వ తేదీకి కోవై జిల్లా పొల్లాచ్చికి దగ్గరలో ఉన్న వడగపాళయం గ్రామానికి చేరుకుంది. దీంతో ఆమె సహా అందరికీ నిబంధనల ప్రకారం అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, వధువుకు అప్పటికే కరోనా వైరస్ సోకివుందని తేలింది. దీంతో వివాహాన్ని ప్రస్తుతానికి ఆపివేశామని పెళ్లి పెద్దలు తెలిపారు.
Marriage
Corona Virus
Cancel
Bride
Tamilnadu

More Telugu News