Allu Arjun: మాసిన గడ్డంతో అల్లు అర్జున్ కొత్త లుక్‌.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన ఫొటో, వీడియోలు వైరల్

bunny new look
  • ఫొటో తీసిన స్థానికుడు
  • తీయొద్దని చెప్పిన బౌన్సర్
  • ఇంటి వద్ద కాలక్షేపం చేస్తోన్న బన్నీ
మాసిన గడ్డంతో సినీనటుడు అల్లు అర్జున్ కొత్త లుక్‌లో కనపడ్డాడు. తాజాగా ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగులు కూడా ఆగిపోవడంతో సినీనటులు ఇంటి వద్దే కాలక్షేపం చేస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బన్నీ తన ఇంటి నుంచి బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఆయన  సూపర్ మార్కెట్‌కు వెళ్లి సరకులు కూడా కొనుగోలు చేశాడు. అప్పట్లోనే ఆయన లుక్ వైరల్ అయింది. తాజాగా రోడ్డుపై ఆయన కనపడగా స్థానికుడు ఒకరు ఫొటో తీశారు. బన్నీ వెనుక బౌన్సర్లు కూడా ఉన్నారు. బన్నీని ఫొటో తీయొద్దని చెప్పారు. అల వైకుంఠపురంలో సినిమాతో భారీ హిట్‌ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
         
Allu Arjun
Tollywood
Lockdown

More Telugu News