Nagababu: భారతీయుల రక్తం తిరిగి వేడెక్కాలంటే ఇలా చేయాలి!: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

naga babu on indians
  • భారతీయుల రక్తం శాంతి, అహింస మంత్రాలతో చల్లబడిపోయింది
  • ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్  కథలని పిల్లలతో చదివించాలి
  • నెక్స్ట్ జనరేషన్ అయినా  పౌరుషంతో పెరుగుతారు
  • వాళ్లనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులుగా తయారు చేద్దాం
తన ట్విట్టర్‌ ఖాతాలో జనసేన నేత, సినీనటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'భారతీయుల రక్తం శాంతి, అహింస మంత్రాలతో చల్లబడిపోయింది. తిరిగి రక్తం వేడెక్కాలంటే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్,అశోక చక్రవర్తి, సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహన్, శ్రీకృష్ణ దేవరాయలు, రాజ రాజ చోళుడు, సముద్రగుప్తుడు మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ అయినా సాహసం, పౌరుషం, మరిగే రక్తంతో పెరుగుతారు. ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది. వాళ్లనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులుగా తయారు చేద్దాం' అని అన్నారు.

'భారత దేశానికి దేశాన్ని ప్రేమించే వీరులు కావాలి. డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు, గూండాలు, మాఫియా, ఫ్యాక్షన్, గూండా రాజకీయ నాయకులు, కుహనా ఉదారవాదులు, ఉగ్రవాదుల నించి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక. ప్రతి నేరాన్ని పోలీస్ ,మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని' అని నాగబాబు పేర్కొన్నారు.
 
Nagababu
Janasena
India

More Telugu News