Donald Trump: అల్లర్లు అదుపులోకి రావట్లేదు.. ఇక సైన్యాన్ని దింపుతాను: డొనాల్డ్ ట్రంప్

trump on agitation in america
  • నల్లజాతి వ్యక్తి జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి పట్ల నిరసనలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్
  • గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు
  • శాంతి, భద్రతలను కాపాడడం నా ప్రథమ కర్తవ్యం
అమెరికా పోలీసుల చేతిలో నల్లజాతి వ్యక్తి జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి చెందడం.. అందుకు నిరసనగా విధ్వంసాలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. అల్లర్లు అదుపులోకి రాకపోతుండడంతో భారీగా సాయుధ బలగాలను రంగంలోకి దించుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అల్లర్ల విషయంలో గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, నేషనల్‌ గార్డ్స్‌ను రాష్ట్రాల్లోకి అనుమతించకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపుతానని చెప్పారు.

అమెరికాలో శాంతి, భద్రతలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. కాగా, నిన్న రాష్ట్రాల గవర్నర్లతో ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి, నిరసనకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారిని పదేళ్లపాటు జైల్లో పెట్టాలని, అలా చేస్తేనే ఇటువంటి ఘటనలు మరోసారి జరగవని చెప్పుకొచ్చారు. తాము వాషింగ్టన్‌ డీసీలో అదే చేస్తున్నామని తెలిపారు. అమెరికా ప్రజలు ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా చర్యలు తీసుకోబోతున్నామని హెచ్చరించారు.
Donald Trump
america

More Telugu News