Chiranjeevi: జన హృదయ నేత కేసీఆర్ తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారం చేశారు: చిరంజీవి

chiranjeevi about telangana formation day
  • ట్వీట్ చేసిన చిరు
  • ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా కేసీఆర్‌ కృషి
  • తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడారు. తెలంగాణ ప్రజల కలను ఆయన సాకారం చేశారని చెబుతూ ట్వీట్ చేశారు.

'ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ కేసీఆర్ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు' అని చిరంజీవి పేర్కొన్నారు.
Chiranjeevi
Tollywood
KCR

More Telugu News