Doctor Sudhakar: సీబీఐ అధికారులకు వినతిపత్రం అందించిన డాక్టర్ సుధాకర్ తల్లి

Doctor Sudhakars mother meets CBI officers
  • విశాఖలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన సుధాకర్ తల్లి
  • ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని విన్నపం
  • విచారణను ముమ్మరం చేసిన సీబీఐ అధికారులు
సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి బాయి అన్నారు. సుధాకర్ పై పోలీసుల దాడి కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలోని సీబీఐ కార్యాలయానికి ఈరోజు కావేరి బాయి వచ్చారు. అక్కడి అధికారులను కలిసి వినతిపత్రం అందించారు. తన కుమారుడి కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేయాలని ఆమె విన్నవించారు.

సుధాకర్ పెద్ద కుమారుడు లలిత్ ను సీబీఐ అధికారులు ఈ ఉదయం నుంచి విచారిస్తున్నారని ఆమె చెప్పారు. విచారణకు తనను పిలిచినా సమాధానాలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. మరోవైపు కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. నాలుగో పట్టణ పోలీసులను సీబీఐ అధికారి ఒకరు ఈరోజు విచారించారు. దీనికి తోడు గత నెల 16న సుధాకర్ ఘటన జరిగిన ప్రదేశాన్ని ఈరోజు సీబీఐ బృందం పరిశీలించింది.
Doctor Sudhakar
CBI
Vizag
Mother

More Telugu News