Avanthi Srinivas: పేదలకు ఇళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టమా? కాదా?: ధ్వజమెత్తిన ఏపీ మంత్రులు

AP Ministers slams Chandrababu
  • చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శలు
  • గజం భూమిని కూడా అన్యాక్రాంతం కానివ్వబోమని ప్రతిన
  • గతంలో చంద్రబాబు ఆస్తులమ్మారని ఆరోపణ
ఏపీ మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. పేదలకు ఇళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టమా? కాదా? అని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

విశాఖ అంతర్జాతీయ స్థాయి నగరం అని, అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో గజం భూమి అన్యాక్రాంతం అయినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అవంతి అన్నారు.

గతంలో ఆస్తులు అమ్మి రాష్ట్రాన్ని చంద్రబాబు దివాలా తీయించారని ఆరోపించారు. ఇప్పుడు భూములు అమ్మడం అనేది కొత్తకాదని తెలిపారు. చంద్రబాబు భూములు అమ్మితే తప్పులేదు కానీ, తాము అమ్మితే తప్పా? అని కన్నబాబు ప్రశ్నించారు.
Avanthi Srinivas
Kannababu
Minister
Chandrababu
Andhra Pradesh

More Telugu News