Jagan: రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్

cm jagan to delhi
  • రేపు అమిత్‌ షాతో భేటీ
  • మరికొంత మంది కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం
  • ఆర్థిక సాయంపైనే ప్రధానంగా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షాతో జగన్ చర్చిస్తారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఆయన ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ప్రధానంగా ఆయన కేంద్ర మంత్రులతో ఆర్థిక అంశాలపైనే మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు నష్టపోయిన వైనాన్ని ఆయన వివరించనున్నట్లు సమాచారం.  
Jagan
Andhra Pradesh
New Delhi

More Telugu News