Chandrababu: నందిగామ పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు, లోకేశ్‌లపై కేసు నమోదు

Case filed against Chandrababu and Lokesh in Nandigama police station
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ లీగల్ సెల్ కార్యదర్శి
  • గత నెల 25న హైదరాబాద్ నుంచి విజయవాడకు చంద్రబాబు
  • లాక్‌డౌన్ ఉల్లంఘనేనంటూ ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

చంద్రబాబు, లోకేశ్‌లు ఇద్దరూ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి గత నెల 25న హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారని, ఇది లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమేనంటూ న్యాయవాది, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బర్రె శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు నందిగామ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ కనకారావు తెలిపారు. అలాగే, మరికొందరిపైనా కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.
Chandrababu
Nara Lokesh
Case
Nandigama

More Telugu News