Mahesh Babu: నీకు పెళ్లయిందా...? అంటూ అభిమానిని ప్రశ్నించిన మహేశ్ బాబు

Mahesh Babu interacts with fans via Instagram live
  • ఇన్ స్టాగ్రామ్ లో మహేశ్ బాబు లైవ్
  • అభిమానుల ప్రశ్నకు ఓపిగ్గా బదులిచ్చిన సూపర్ స్టార్
  • తండ్రి గురించి ఒక్కమాటలో చెప్పలేనని వెల్లడి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సాయంత్రం అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. ఓ అభిమాని "సర్, మీకు నమ్రత మేడమ్ పై ఎంత ప్రేమ ఉంది?" అని అడగ్గా, "నీకు పెళ్లయిందా... ముందు నాకు సమాధానం చెప్పు!" అంటూ నవ్వుతున్న ఎమోజీ పోస్ట్ చేశారు.

 అంతేకాదు, సమంత నటన నచ్చిందా, రష్మిక నటన నచ్చిందా? అని మరో ఫ్యాన్ ప్రశ్నించగా, మహేశ్ బాబు  ఇద్దరి నటన నచ్చిందని, అద్భుతమైన నటీమణులని కితాబిచ్చారు. కృష్ణ గారి గురించి ఒక్క మాటలో చెప్పమని కోరగా, ఆయన గురించి చెప్పేందుకు ఒక్క మాట సరిపోదని బదులిచ్చారు.

మీరు జేమ్స్ బాండ్ తరహా చిత్రాల్లో నటిస్తే చూడాలని ఉందని ఓ ఫ్యాన్ కోరాడు. అందుకు మహేశ్ బాబు రిప్లయ్ ఇలా ఉంది... వీలైతే నాకు మంచి స్క్రిప్టు సిద్ధం చేసి పంపండి. నాక్కూడా జేమ్స్ బాండ్ తరహా సినిమాలు బాగా ఇష్టం అని అన్నారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కచ్చితంగా సినిమా చేస్తానని, ఆయన కథ చెప్పడమే తరువాయి అని స్పష్టం చేశారు. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే టక్కున నమ్రత అని చెప్పేశారు. తనకిష్టమైన క్రికెటర్లుగా ధోనీ, సచిన్, కోహ్లీ అని వెల్లడించారు.
Mahesh Babu
Live
Instagram
Fans
Tollywood

More Telugu News