డాక్టర్ సుధాకర్ కేసులో కేజీహెచ్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్న సీబీఐ అధికారులు
- రెండోరోజూ కొనసాగిన సీబీఐ విచారణ
- మెడికో లీగల్ కేసు కావడంతో ఎంఎల్సీ స్వాధీనం
- వైద్యుల నుంచి వాంగ్మూలం సేకరణ
ఈ సందర్భంగా ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు హౌస్ సర్జన్ల నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మెడికో లీగల్ కేసు కావడంతో ఎంఎల్సీ రికార్డు సైతం సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ సుధాకర్ ను కేజీహెచ్ కు తీసుకువచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకు ఏం జరిగిందన్న దానిపై సీసీటీవీ ఫుటేజిని పరిశీలించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.