Nimmagadda Ramesh: పదవీకాలం పూర్తయ్యేవరకు కొనసాగమని ఆర్డర్ కాపీలో ఉంది: నిమ్మగడ్డ రమేశ్

Nimmagadda Ramesh explains high court order
  • నిమ్మగడ్డ అంశంలో హైకోర్టు కీలక తీర్పు
  • ఆర్డినెన్స్ ను హైకోర్టు తోసిపుచ్చిందని వెల్లడి
  • పదవిలో కొనసాగే హక్కును హైకోర్టు గుర్తించిందని వివరణ
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఊరట కలిగిస్తూ, ఎస్ఈసీగా కొనసాగవచ్చని ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర విమర్శల దాడి జరుగుతోంది.

కాగా, తీర్పు అంశంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చిందని వెల్లడించారు. తనను ఈసీగా తిరిగి నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. తన పదవీకాలం పూర్తయ్యేవరకు కొనసాగమని ఆర్డర్ కాపీలో ఉందని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. పదవిలో కొనసాగే నా హక్కును రాష్ట్ర హైకోర్టు గుర్తించింది అని పేర్కొన్నారు.
Nimmagadda Ramesh
AP High Court
SEC
Andhra Pradesh

More Telugu News