Kanna Lakshminarayana: హైకోర్టు తీర్పును గౌరవించండి... ఏపీ సర్కారుకు నేనిచ్చే సలహా ఇదే: కన్నా

Kanna suggests AP Government to restore Nimmagadda as SEC
  • నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ సర్కారుకు హైకోర్టు ఎదురుదెబ్బ
  • నిమ్మగడ్డ పదవిని పునరుద్ధరించాలన్న కన్నా
  • ఈ విషయాన్ని మరింత సాగదీయవద్దని హితవు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొనసాగవచ్చంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పై కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. దీనిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. "ఏపీ ప్రభుత్వానికి నేనిచ్చే గట్టి సలహా ఏంటంటే... హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎస్ఈసీ గా పునరుద్ధరించండి. ఈ విషయాన్ని మరింత సాగిదీస్తే రాష్ట్రానికున్న మంచి పేరు పోవడమే కాదు, న్యాయవ్యవస్థ పట్ల రాష్ట్రానికున్న గౌరవాన్ని కూడా తగ్గించినట్టవుతుంది" అంటూ ట్వీట్ చేశారు.
Kanna Lakshminarayana
Nimmagadda Ramesh
YSRCP
SEC
AP High Court
Andhra Pradesh

More Telugu News