Narendra Modi: మరింత జాగ్రత్తగా ఉండాలి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

modi mann ki baat
  • ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి
  • మాస్కులు ధరించాలి
  • కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది
  • మిడతల దండు దాడి వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటాం
కరోనా విజృంభణ నేపథ్యంలో భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోజు మన్‌ కీ బాత్‌లో ఆయన మాట్లాడుతూ... 'కరోనాపై దేశ ప్రజలంతా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం మరింత సమర్థంగా కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలి. కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది.. యోగా ద్వారా దీన్ని అధిగమించవచ్చు' అని చెప్పారు.

'నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ వరంగా మారింది. దీని వల్ల కోటి మంది నిరుపేదలు చికిత్స పొందారు. కోటిమంది నిరుపేద లబ్ధిదారుల్లో 80 శాతం మంది గ్రామీణులే. వలస కూలీల తరలింపునకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతున్నాం' అని తెలిపారు.

'కరోనా సమయంలో ఎందరో కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు. అన్ని రంగాల వారు విశేష కృషి చేస్తున్నారు. మాస్కులు తయారు చేసి మహిళా సంఘాలు చేయూతనిచ్చాయి. విద్యా రంగంలోనూ ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు' అని మోదీ చెప్పారు.

'కరోనా సమయంలో పేదల కష్టాలు వర్ణనాతీతం. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. కాగా, మిడతల దండు దాడి వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటాం' అని ప్రధాని మోదీ తెలిపారు.
Narendra Modi
Mann Ki Baat
Corona Virus

More Telugu News