Doctor Sudhakar: డాక్టర్ సుధాకర్ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ!

CBI stated inquiry in doctor Sudhakar case
  • సుధాకర్ పై దాడి కేసును విచారిస్తున్న సీబీఐ
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ఐదు గంటల సేపు సమాచారాన్ని సేకరించిన అధికారులు
విశాఖ వైద్యుడు సుధాకర్ కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. సుధాకర్ పట్ల దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేసి విచారించాలని సీబీఐని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సీబీఐ ఈరోజు రంగంలోకి దిగింది. సుధాకర్ ను ఉంచిన మానసిక చికిత్సాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు దాదాపు ఐదు గంటలసేపు ఆయన నుంచి పూర్తి వివరాలను తీసుకున్నారు. మాస్కులు ఇవ్వలేదంటూ గొడవ చేసిన రోజు నుంచి జరిగిన అన్ని పరిణామాలపై సమాచారాన్ని సేకరించారు.

మరోవైపు హైకోర్టు ఆదేశాలతో కేసును విచారించిన సీబీఐ... పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఐపీసీ 120బి, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కావాలని దూషించడం, నేరపూరిత కుట్ర, దొంగతనం, బెదిరింపులకు పాల్పడటం, అక్రమ నిర్బంధం వంటి అభియోగాలను నమోదు చేశారు.
Doctor Sudhakar
Vizag
CBI

More Telugu News