Pothula Sunitha: పార్టీ విప్‌ను ధిక్కరించిన టీడీపీ ఎమ్మెల్సీలు సునీత, శివనాథరెడ్డిలకు నోటీసులు

TDP MLCs Pothula Sunitha and Sivanathareddy got notices from Legislative Council
  • పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఓటింగ్ సందర్భంగా పార్టీ విప్ ధిక్కరణ
  • అనర్హత వేటు వేయాలంటూ పార్టీ విప్ బుద్ధా వెంకన్న ఫిర్యాదు
  • జూన్ 3న మధ్యాహ్నం తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు
ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఓటింగ్ సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించిన టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ విప్ బుద్ధా వెంకన్న శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఎమ్మెల్సీలు ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. జూన్ 3న మధ్యాహ్నం మూడు గంటలకు తమ ఎదుట హాజరు కావాలని వారికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు.
Pothula Sunitha
Sivanathareddy
TDP MLC
Legislative Council

More Telugu News