SEC: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న వైసీపీ ప్రభుత్వం

AP govt to challenge High Court verdict in Supreme Court in SEC Ramesh case
  • ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలని హైకోర్టు తీర్పు
  • హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయనున్న ప్రభుత్వం
  • సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సును రద్దు చేసింది. ఈ తీర్పుపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. కోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.  
SEC
Nimmagadda Ramesh
AP High Court
Supreme Court

More Telugu News