Amit Shah: మోదీతో అమిత్ షా భేటీ.. లాక్‌డౌన్‌ పొడిగింపు, చైనా వ్యవహారంపై కీలక చర్చలు

amit shah meets modi
  • ఈ నెల 31న ముగుస్తున్న లాక్‌డౌన్‌
  • చైనాతో ఉద్రిక్త పరిస్థితులు
  • తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌  ఈ నెల 31న ముగుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, చైనాతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రెండు అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా  సమావేశమయ్యారు. లాక్‌డౌన్ ఐదో దశ విధించే అంశంపై వారు కీలక చర్చలు జరుపుతున్నారు.

మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే దాని ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా కొన్ని రోజులుగా పాల్పడుతున్న దుందుడుకు చర్యలపై కూడా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో వారు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Amit Shah
Narendra Modi
India
Lockdown

More Telugu News