AP High Court: హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో 44 మందికి నోటీసులు

ap high court sends notices
  • ఇప్పటికే 49 మందిపై కేసులు 
  • ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు
  • అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ
న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఇప్పటికే 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు పెట్టి హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారిలో ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. ఈ రోజు మరో 44 మందికి నోటీసులు జారీ చేసింది.

ఈ కేసుల విషయంలో హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.  నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంపై సీఐడీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. మరో 44 మందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
AP High Court
Andhra Pradesh

More Telugu News